![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -34 లో.....గంగని తీసుకొని శకుంతల ఇంటికి వస్తుంది. వద్దని ఇంట్లో వాళ్ళు అంటారు. ఇప్పుడు గంగ ఉంటే నష్టం ఏముందని శకుంతల అంటుంది. మీకు నా నిర్ణయం ఇబ్బంది పెడితే చెప్పండి విడిగా ఉందామని శకుంతల అనగానే అందరూ షాక్ అవుతారు. గంగని తీసుకొని నేనే వెళ్ళిపోతానని శకుంతల చెప్తుంది.
పెద్దమ్మ ఇంకొకసారి ఆ మాట అనకండి ఇన్నిరోజులు ఈ కుటుంబం మీ నిశ్శబ్దం చూసింది.. ఇప్పుడు మీరు లేకుండా ఈ ఇల్లు ఉండదు.. మీ నిర్ణయానికి ఎవరు అడ్డు చెప్పరని రుద్ర అంటాడు. ఆ తర్వాత శకుంతల కోడలు, కూతురు గంగని తీసుకొని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లిన తర్వాత గంగ ఏడుస్తుంటే వాళ్ళు ఓదారుస్తారు. ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తుంటే గంగ వస్తుంది. గంగని చూసి కావాలనే ఇషిక తను బాధపడేలా మాట్లాడుతుంది. అందరూ ఫోన్ చేసి ఆ గంగని ఎందుకు మీ ఇంట్లో ఉంచుకున్నారని అడుగుతున్నారని అంటుంది. ఆ మాటలు గంగ విని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత శకుంతల వచ్చి గంగకి టిఫిన్ తీసుకొని వెళ్తుంది.
శకుంతల వెళ్లేసరికి గంగ ఏడుస్తుంది. తనని పైన కూర్చొబెట్టుకొని దైర్యం చెప్తుంది. మా అమ్మ కూడా ఇలాగే చెప్పేదని వాళ్ళ అమ్మ ఏమందో శకుంతలకి చెప్తుంది గంగ. తరువాయి భాగంలో ఇషిక, వీరు కలిసి గంగ తో మాట్లాడతారు. తను ఇంట్లో నుండి వెళ్లిపోయేలా మాట్లాడతారు. శకుంతల కాళ్ళు మొక్కి గంగ ఇంట్లో నుండి వెళ్లిపోవాలని ట్రై చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |